గతకాలమంత నీ నీడలోన దాచావు దేవా వందనం

గతకాలమంత నీ నీడలోన

దాచావు దేవా వందనం

కృప చూపినావు – కాపాడినావు

ఎలా తీర్చగలను నీ ఋణం

పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన – (2)

వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2)           ||గతకాలమంత||


ఎన్నెన్నో అవమానాలెదురైననూ

నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్యా

ఇక్కట్లతో నేను కృంగిననూ

నీ చేయి నను తాకి లేపెనయ్యా

నిజమైన నీ ప్రేమ నిష్కళంకము

నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2)

వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2)           ||గతకాలమంత||


మాటలే ముళ్ళుగ మారిన వేళ

నీ మాట నన్ను పలకరించెనయా

నిందలతో నేను నిండిన వేళ

నీ దక్షిణ హస్తం నను తాకెనయా

నీ మాట చక్కటి జీవపు ఊట

మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2)

వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2)


గతకాలమంత నీ నీడలోన – దాచావు దేవా వందనం

కృప చూపినావు – కాపాడినావు

ఎలా తీర్చగలను నీ ఋణం

పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన – (2)

వందనం యేసయ్యా – విభుడవు నీవయ్యా (2)           ||గతకాలమంత||

Post a Comment

0 Comments