ఆరాధన… ఆరాధన…

 ఆరాధన… ఆరాధన…


ఆరాధన… ఆరాధన…

ఆరాధన యోగ్యునికి

ఆరాధనను చెల్లించెదము


సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి

సర్వ సంపదలు కురిపించు వానికి

సత్య మార్గములో నడిపించు వానికి

ఆరాధన చెల్లించెదము            ||ఆరాధన||


చీకు చింతలు చుట్టూ ముట్టిన

బ్రతుకు గుండె బరువై పోయిన

ఆదరించి ఓదార్చే వానికి

ఆరాధన చెల్లించెదము            ||ఆరాధన||


ఆత్మ ఫలములు ఫలించుటకు

ఆత్మ వారములు కురిపించువానికి

ఆత్మ అభిషేకం దయచేయువానికి

ఆరాధన చెల్లించెదము            ||ఆరాధన||


మార్గము నేనే సత్యము నేనే

జీవము నేనే అని పలికిన యేసు

తండ్రీ కుమారా పరిశుద్ధాత్మకు

ఆరాధన చెల్లించెదము            ||ఆరాధన||

Post a Comment

1 Comments