రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము Songs Lyrics

 రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము

నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు

హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి

మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను         ||రావయ్య||


నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి

మా గండంబులన్నియు ఖండించుటకు        ||రావయ్య||


మేర లేని పాపము మాకు భారమైన మోపు

నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు       ||రావయ్య||


పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను

మా పాపంబులన్నియు పారద్రోలుటకు          ||రావయ్య||


అందమైన నీదు పరమానంద పురమందు

మేమందరము జేరి యానందించుటకు         ||రావయ్య||

Post a Comment

0 Comments